జోగిపేటకు మంత్రి దామోదర్
NEWS Sep 13,2024 05:21 am
ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార మహోత్సవ కార్యక్రమానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేటకు రానున్నట్లు పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మాణయ్య తెలిపారు.ఈ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార కార్యక్రమం మంత్రి దామోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య అతిథులుగా జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు హాజరుకానున్నారు.