లారీ ఢీకొని వృద్ధుడు మృతి
NEWS Sep 13,2024 05:08 am
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలో లారీ ఢీకొని రణవేణి చిన్న లింగయ్య (60) మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మృతుడు లింగయ్య, మల్యాల లింగుతో కలిసి వ్యవసాయ పనులకు టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో లింగయ్య అక్కడికక్కడే మృతి చెందగా, లింగుకు గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.