యానాం: మిలాదే నబీని పురస్కరించుకుని ఈ నెల 17న యానాంలో మద్యం షాపులు మూసివేయాలని డిప్యూటీ కలెక్టర్ (ఎక్సైజ్) మాథ్యూఫ్రాన్సిస్ తెలిపారు. మద్యం షాపులతో పాటు బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయాలని ఆదేశాలు పంపామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.