కోటనందూరు: తాండవ రిజర్వాయర్ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను కోటనందూరు ఎస్సై రామకృష్ణ గురువారం సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదుచేశామన్నారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. చట్టప్రకారం నదీ గర్భంలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగించడం నేరమన్నారు. అక్రమ తవ్వకాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.