జోగిపేట పట్టణంలోని రజక సంఘం ఆధ్వర్యంలో గణపయ్య వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 17వ వార్డు కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) సతీ సమేతంగా విచ్చేశారు. విగ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కరాటే అశోక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో కౌన్సిలర్ చిట్టిబాబు రాధిక దంపతులు భక్తులకు అన్నదాన వితరణ సేవ చేశారు. అనంతరం చిట్టిబాబు మాట్లాడుతూ.. నిమజ్జనం కూడా భక్తి శ్రద్ధలతో చేయాలన్నారు.