పిఠాపురంలో జగన్ పర్యటన
NEWS Sep 13,2024 05:20 am
పిఠాపురం నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ నేడు (శుక్రవారం) పర్యటించనున్నారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడేపల్లిలో బయలుదేరి 10:30కి పిఠాపురం చేరుకుంటారు. మాధవపురం, పాత ఇసుకపల్లి, నాగులపల్లి, రమణక్కపేట, గ్రామాల్లో పర్యటించిన అనంతరం 12:30కి తాడేపల్లికి బయలుదేరి వెళ్లనున్నారని అధికారులు తెలిపారు.