కొవ్వూరు: అశ్లీల నృత్యాలు చేస్తున్నారన్న ఫిర్యాదుతో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరులో బుధవారం రాత్రి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో అశ్లీల నృత్యాలు చేశారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించి 13 మందిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై శ్రీహరి తెలిపారు.