నేడు స్కూళ్లు ఓపెన్: కలెక్టర్
NEWS Sep 13,2024 05:21 am
కాకినాడ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నేటి (శుక్రవారం) నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. వరద ప్రభావం తగ్గడంతో అన్నిచోట్ల తరగతులు నిర్వహించాలని సూచించారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు.