బ్లడ్ సెంటర్ స్థలం కోసం కలెక్టర్‌కి వినతి
NEWS Sep 12,2024 06:22 pm
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే బ్లడ్ సెంటర్ కొరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించవలసిందిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కోరారు. సిరిసిల్ల జిల్లా శాఖను రెడ్ క్రాస్ చైర్మన్ గుడ్లరవి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఈవీ శ్రీనివాసరావు కలిసి జిల్లా కలెక్టర్ ను సన్మానించి వినతి పత్రంఅందించారు. కలెక్టర్ వెంటనే స్పందించి బ్లడ్ సెంటర్ కు స్థలం వేములవాడ ప్రాంతంలో కేటాయిస్తానని సూచించడం జరిగిందని తెలిపారు.