సీతారాం ఏచూరికి ఘన నివాళులు
NEWS Sep 12,2024 06:20 pm
అఖిలభారత సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరికి సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘన నివాళులు అర్పించారు. ఆయన మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు, బ్రాహ్మణకుటుంబంలో పుట్టివిద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ విద్యార్థిగా వామపక్షం భావాజాలకు ఆకర్షితుడై భారతదేశంలో సమ సమాజ నిర్మాణం కోసం తన జీవితాంతం పోరాడిన మహనీయుడు బడుగు బలహీన వర్గాల కార్మిక వర్గాలకోసం నిరంతరం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అని సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ అన్నారు.