తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
NEWS Sep 12,2024 06:18 pm
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కలకడ నుంచి చెన్నైకి టమాటోల లోడుతో వెళ్తోన్న కంటైనర్ లారీ అదుపుతప్పి.. తిరుపతి నుంచి పీలేరు వైపు వెళ్తోన్న కారు, బైకుపై పడింది. కంటైనర్‌లో కింద ఉన్న కారులో ఎంత మంది ప్రయాణిస్తున్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది.