రమేష్ పొన్నాలకు డాక్టరేట్
NEWS Sep 12,2024 06:16 pm
రాజన్న సిరిసిల్ల: తంగళ్ళపల్లి మండలం వేణుగోపాలపూర్ గ్రామనికి చెందిన రమేష్ పొన్నాల డాక్టరేట్ సాధించారు. రమేష్ సాఫ్ట్‌వేర్ డిఫెక్ట్ ప్రిడిక్షన్ కోసం హైబ్రిడ్ మోడల్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్‌తో క్లాస్ అసమతుల్యత, ఫీచర్ తగ్గింపును పరిష్కరించడం అనే అంశంపై పరిశోధన చేసారు. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ సి.ఆర్.కే రెడ్డి పర్యవేక్షణలో తన పరిశోధనను పూర్తి చేసినట్లు రమేష్ తేలిపారు. రమేష్ ను మిత్రులు, స్థానికులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.