పెద్దాపురం: రైతులను ఏలేరు నిండా ముంచిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వేల ఎకరాలు నీటమునిగాయని చెప్పారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కండ్రుకోటలో ముంపు ప్రాంతాలను ఆమె పరిశీలించారు. ఏలేరు ఆధునికీకరణపై వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఆ తర్వాత వచ్చిన నాయకులకు లేదని విమర్శించారు.