పోలీసుల పేరుతో చేసే ఫోన్ కాల్స్ పై
అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ అశోక్
NEWS Sep 12,2024 06:06 pm
పోలీసులమని అగంతుకులు చేసే ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మీ కుటుంబ సభ్యులు ఏదో కేసులో ఇరుక్కున్నారని బెదిరించడం, డబ్బులు డిమాండ్ చేయడం, లేక సైబర్ నేరాలకు పాల్పడేందుకు వ్యక్తిగత వివరాలు అడగడం, లేదంటే నెంబర్ బ్లాక్ అవుతుందని దబాయించడం వంటి కేసులు పెరిగిపోయాయన్నారు.