విద్యకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
- మంత్రి డోలా స్వామి
NEWS Sep 12,2024 06:08 pm
విద్యకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షి యల్ ఎడ్యుకేషన్ ఇనిస్ట్యూట్స్ మంత్రి ఉమ్మడి క్రిష్ణా జిల్లా బాలికల గురుకుల పాఠశాలలు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురుకులాల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి. గురుకులాల్లో బాలికలకు డిగ్రీ, ఐటీఐ కోర్సులు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.