తూప్రాన్ పట్టణంలో నిర్వహించిన వాహన తనిఖీలో మొబైల్ చోరీ నిందితులను పట్టుకున్నట్లు ఎస్సై శివానందం తెలిపారు. రావెల్లికి చెందిన బాణాపురం రాజుకు చెందిన మొబైల్ 9న బస్టాండ్ వద్ద చోరీకి గురైనట్లు వివరించారు. ఈరోజు వాహన తనిఖీ చేపట్టగా ఆ ఫోన్ తో పాటు 17 ఫోన్లు లభించినట్లు వివరించారు. ఈడిగ రవికుమార్ గౌడ్, సత్పాడి అరవింద్ లతో పాటు ఇద్దరు చిన్నారులను పట్టుకున్నట్లు తెలిపారు.