అక్రమంగా నిలువ ఉంచిన
రేషన్ బియ్యం పట్టివేత
NEWS Sep 12,2024 06:10 pm
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో శనిగారపు రాజేందర్ షెడ్డులో అక్రమంగా పిడిఎస్ బియ్యం నిల్వ ఉంచారని సమాచారం మేరకు మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ కిరణ్ కుమార్ వారి సిబ్బందితో కలిసి దాడి చేయగా అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యం 20 బస్తాలు సుమారు10 క్వింటాలు స్వాధీనం చేసుకున్నారు నిల్వ ఉంచిన వ్యక్తులు ఆకుల శ్రీకాంత్, పస్తం రాజేష్ లను అదుపులోకి తీసుకొని విచారించగా ఖనాపూర్ కి చెందిన ప్రభాకర్ అనే వ్యాపారికి అమ్ముతున్నాం అని తెలుపగా వారి ముగ్గురుపై కేసు నమోదు చేశారు