పేకాట స్థావరంపై పోలీసుల దాడి
NEWS Sep 12,2024 06:12 pm
గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధి సంగుపల్లి కురుమ సంఘం భవనంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, గజ్వేల్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. దాడుల్లో బక్కోళ్ల కుమార్, రమేష్, గజ్జల మల్లేష్, ఎర్రబేరి ముత్యాలు, పెద్దాపుల్ల శ్రీకాంత్ పట్టుబడగా రూ. 5100 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.