తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఉమామహేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు పూజారులు శలాక ఆత్రేయ శర్మ, హరీష్ శర్మల ఆధ్వర్యంలో గణపతి హోమం, రుద్ర హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్నారు.