మూల నక్షత్ర విశేష పూజలు
NEWS Sep 12,2024 06:13 pm
ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో మూల నక్షత్ర విశేష పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి మూల మహోత్సవానికి అంకురార్పణ చేశారు. అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, చండీ హోమం, లక్ష పుష్పార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.