మంకీపాక్స్ లక్షణాలు ఇవే..
NEWS Sep 12,2024 01:40 pm
మంకీపాక్స్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. WHO ప్రకారం.. మంకీపాక్స్ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు. జ్వరం, శరీరంపై పొక్కులు, గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ వంటి లక్షణాలు 2 నుంచి 4 వారాలు ఉండొచ్చు. మరికొందరిలో నోరు, కళ్లు, గొంతు, ప్రైవేట్ భాగాలపై పొక్కులు రావొచ్చు. అయితే ఎవరూ ఆందోళన చెందవద్దని.. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు