సీతారాం ఏచూరి భౌతికకాయం దానం
NEWS Sep 12,2024 01:29 pm
అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ (ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కు దానం చేశారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల బోధన, రీసెర్చ్ లో ఏచూరి భౌతికకాయాన్ని ఉపయోగించుకోవాలని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ను కోరారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.