చంద్రబాబుకు లేఖ రాసిన పవన్
NEWS Sep 12,2024 01:25 pm
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. మంగళగిరిలోని తన నివాసాన్ని ఇకపై క్యాంపు ఆఫీస్ గా ఉపయోగించుకుంటానని వెల్లడించారు. అందుకే, విజయవాడలో కేటాయించిన క్యాంపు ఆఫీస్, ఫర్నిచర్, సామగ్రి వెనక్కి తీసుకోవాలని కోరుతున్నానని పవన్ అన్నారు. మంగళగిరిలోని నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తానని, విజయవాడ క్యాంపు ఆఫీస్ ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తున్నానని పవన్ వివరణ ఇచ్చారు.