వినాయక నిమజ్జనానికి వాగులో పూడిక తీత
NEWS Sep 12,2024 01:16 pm
మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో మెట్‌పల్లి పట్టణంలోని వట్టివాగులో గణేశ్ నిమజ్జనం కొరకు పూడికతీత పనులను గురువారం ప్రారంభించారు. గణేశ్ నిమజ్జనానికై వట్టి వాగులో 25 ఫీట్ల లోతు పూడిక తీయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ మోహన్ తెలిపారు. నిమజ్జనం చేసే పాయింట్ల వద్ద మొరం పోసి చిప్స్ వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముజీబ్, సంతోశ్, మహేశ్ తదితరులున్నారు.