ప్రకాశం జిల్లా ఒంగోలులోని రంగారావు చెరువు నీటిలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.