కౌశిక్ మాటలపై కేసీఆర్ స్పందించాలి
NEWS Sep 12,2024 12:37 pm
బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ.. వారికి టిక్కెట్లు ఇవ్వవద్దా? BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాటలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని, ఎక్కడి నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని సవాల్ విసిరితే చూస్తూ కూర్చుంటామా? అని అరికెపూడి గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. ఢిల్లీలో మీడియాతో సీఎం మాట్లాడుతూ.. కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.