కర్ణాటకలోని కలబురగిలో నదీమ్ (26) అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీమ్ రిపేర్ కోసం షోరూమ్ స్టాఫ్ను సంప్రదించాడు. ఎన్ని సార్లు వెళ్లినా అక్కడి స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగ్రహానికి గురై, షోరూమ్కు నిప్పంటించాడు. ఈ ఘటనలో దాదాపు 6 స్కూటర్లు దహనమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.