వినాయక నిమజ్జనం ఏర్పాట్లు
NEWS Sep 12,2024 01:04 pm
పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి, డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి వినాయక నిమజ్జనం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో మానేరునది తీరాన పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. వినాయకచవితి నుండి వినాయక నిమజ్జనం వరకు ప్రజలు భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ఆరాధించి వినాయక నిమజ్జనంరోజు అంతే భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడికి వినాయకుడిని చేరుస్తారని సకాలంలో వినాయక నిమజ్జనం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా కోరారు.