జిల్లాలో కేంద్ర బృందం పరిశీలన
NEWS Sep 12,2024 01:02 pm
గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన పంటల పరిశీలన కోసం కేంద్ర బృందం గురువారం గుంటూరు వచ్చింది. ముందుగా కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన వరద ప్రభావిత ప్రాంతాల ఫొటో ప్రదర్శనని బృందంలో సభ్యులు పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ నుంచి బయలుదేరి పెదకాకాని, మంగళగిరి, తుళ్ళూరు ప్రాంతాల్లోని పంట పొలాలు, వరద ముంపు గ్రామాలలో పరిశీలించనున్నారు.