రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నాన్ని పోలీసులు విఫలం చేశారు. తెలుగు భాష విషయంలో రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం చేసే వారి ప్రయత్నాన్ని పోలీసులు విఫలం చేసి అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.