మాజీ మంత్రి వర్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాతృమూర్తి ప్రత్తిపాటి నారాయణమ్మ బుధవారం ఉదయం 11.30 కు మృతి చెందారు. గత కొంత కాలంగా వైద్య సేవల కోసం ఆమె హైదరాబాద్ లో ఉంటున్నారు. నేటి సాయంత్రానికి చిలకలూరిపేటకు వారి మృతదేహాన్ని తీసుకురావడం జరుగుతుంది. రేపు ఉదయం (గురువారం) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.