నిబంధనలకు అనుగుణంగా అనుమతి ఇవ్వాలి.
NEWS Sep 12,2024 12:59 pm
సిరిసిల్ల జిల్లా: నియమ,నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పరిశ్రమల, ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటిదాకా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? అనుమతి కోసం ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి?.ఏ ఏ కారణాలతో నిలిచిపోయాయో ఆయా శాఖల ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.