ఉమ్మడి జిల్లాలో 10,325 గణేశుడి విగ్రహాలు
NEWS Sep 12,2024 12:41 pm
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గణేశుడి నిమజ్జనానికి పోలీస్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశుడి నిమజ్జనం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ నిఘా వర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తిగా 10 వేలకు పైగా విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు గుర్తించారు. కరీంనగర్ 2931, పెద్దపల్లి 2405, జగిత్యాల 2791, సిరిసిల్ల 2198 విగ్రహాలు ఉన్నట్టు గుర్తించారు.