జగన్ పాపమే బుడమేరు శాపం:
మాజీ మంత్రి దేవినేని ఉమా
NEWS Sep 12,2024 12:44 pm
కందులపాడు వద్ద బుడమేరు వద్ద కొట్టుకుపోయిన బ్రిడ్జినీ టీడీపీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కమీషన్లకు కక్కుర్తిపడి బుడమేరుపై బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారనీ, ఇరిగేషన్ శాఖ అధికారులు చేపట్టవలసిన పనులను ఆర్ అండ్ బి అధికారులు ఎందుకు చేస్తున్నట్లు అని గతంలో తాను పలుమార్లు హెచ్చరించిన పట్టించుకోలేదన్నారు. తప్పు చేయొద్దని నెత్తి నోరు కొట్టుకుని చెప్పిన వినలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.