వినాయక నిమజ్జనం ఏర్పాట్లు
NEWS Sep 12,2024 12:55 pm
MDK: రామాయంపేట మండలంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను ఎస్సై బాలరాజు, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పరిశీలించారు. ఈనెల 16న వినాయక నిమజ్జనం నేపథ్యంలో మండల కేంద్రంలోని కొత్తచెరువు, వెంకన్న గారి చెరువు వద్ద ఏర్పాట్లను వారు పరిశీలించారు. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు భారీకేడ్ ఏర్పాటు చేయాలని సూచించారు, నిమజ్జనం కోసం భారీ క్రేన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని వారు తెలిపారు.