బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
అందించిన డాక్టర్ మోహన్ నాయక్
NEWS Sep 12,2024 12:57 pm
మెదక్ మండల పరిధిలోని తిమ్మక్కపల్లి తండాకు చెందిన సురేష్ నాయక్ దుబాయ్ లో మరణించారు. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ సురేష్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిరుపేద కుటుంబం కావడంతో వారికి తన వంతుగా రూ. 5000 నగదు, 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులను అందజేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నాయక్, డి.శివ తదితరులు పాల్గొన్నారు.