Hyd మెట్రోలో జర్నీ.. గిన్నీస్ రికార్డ్!
NEWS Sep 12,2024 10:51 am
ఢిల్లీకి చెందిన అకాడెమిక్ రీసెర్చర్‌గా పనిచేస్తున్న శశాంక్ హైదరాబాద్‌లోని 57 మెట్రో స్టేషన్లను 2 గంటల 41 నిమిషాల్లో సందర్శించి, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ దక్కించుకున్నాడు. గతంలో ఢిల్లీలో అన్ని మెట్రో స్టేషన్‌లను అత్యంత వేగంగా ప్రయాణించిన రికార్డు కూడా అతని పేరు మీదే ఉంది. ఢిల్లీలో 288 మెట్రో స్టేషన్స్ ఉండటంతో అతనికి 15 గంటల సమయం పట్టింది.