పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం
NEWS Sep 12,2024 10:27 am
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 72 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇలాగే కొనసాగితే భారత్‌లో చమురు ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పంకజ్ జైన్ కూడా వెల్లడించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు ఇదేస్థాయిలో కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం అంటున్నారు.