చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
NEWS Sep 12,2024 10:31 am
చిన్న శంకరంపేట: చేపల వేటకు వెళ్లిన ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో ముని మృతి చెందిన ఘటన చిన్న శంకరంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖాజాపూర్ గ్రామానికి చెందిన రూపుల వెంకట్ అనే 35 సంవత్సరాల వ్యక్తి సోమవారం శాలిపేట చెరువులో చేపల వేటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయారు గురువారం చెరువుల మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టంకు తరలించారు. మృతుడికి భార్య కూతురు ఉన్నారు.