రామాయంపేటలో పర్యటించిన మైనంపల్లి
NEWS Sep 12,2024 10:30 am
MDK: రామాయంపేట మండల కేంద్రంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పర్యటించారు. స్థానిక ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో మైనంపల్లి పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు బాగా పండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుప్రభాత్ రావు, రామచంద్ర గౌడ్, పాల్గొన్నారు.