గణేష్ మండపాలలో అన్నదాన కార్యక్రమాలు
NEWS Sep 12,2024 10:30 am
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మల్యాల మండల కేంద్రంలో పలు గణేష్ మండపాల నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.. స్థానిక వాగ్దేవి పాఠశాలలో కొలువుదీరిన గణేశుని మండపంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభిషేకము, పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా 2 వేల మంది పాల్గొన్నారు.