అరకు: అరకులోయ మండలం, యండపల్లివలస టీచర్స్ కాలనీ వద్ద వినాయక చవితి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో బాగంగా గురువారం మధ్యాహ్నం అవతార్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో వర్తకులు, స్ధానికుల సహకారంతో సుమారు 2500 మంది పాల్గొనే విధంగా భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాధాన్ని స్వీకరించారు.