జగిత్యాల: తమ సంస్థలో లింక్ ద్వారా పెట్టుబడి పెడితే అధిక వడ్డీ చెల్లిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. జగిత్యాలకి చెందిన కృష్ణకు సైబర్ నేరగాళ్లు వాట్సప్ కి ఒక లింక్ పంపారు. లింక్ ఓపెన్ చేసి పెట్టుబడి పెడితే ప్రతిరోజూ అధిక వడ్డీ చెల్లిస్తామని నమ్మించారు. దీంతో కృష్ణ రూ.1.15 లక్షలు ఆన్లైన్ ఖాతాలో పంపాడు. బుధవారం లింక్ ఓపెన్ కాకపోవడంతో మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.