ధర్మపురి: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
NEWS Sep 12,2024 08:08 am
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామానికి చెందిన స్రవంతి డిగ్రీ చదువుతోంది. కాగా, బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ధర్మపురి ఎస్ఐ మహేశ్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.