నిండు కుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
NEWS Sep 12,2024 08:07 am
ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టుకు గంట గంటకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1091.00 అడుగులు, 80.50 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టులో 35,283 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో నుంచి 16,525 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది.