కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్
NEWS Sep 12,2024 07:41 am
HYD: కొండాపూర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. కౌశిక్ ఇంటికి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేరుకోవటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరించి అక్కడికి చేరుకున్న గాంధీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఘటనా స్థలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల పరిస్పర నినాదాలతో హోరెత్తింది. కౌశిక్ రెడ్డి ఇంటి కిటీకిలు ధ్వంసం చేశారు.