ఎంతమంది ప్రాణాలు బలిపెట్టాలి?
NEWS Sep 12,2024 07:30 am
సీఎం రేవంత్ చేసిన ద్రోహానికి ఎంతమంది రైతులు ప్రాణాలు బలిపెట్టాలని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని కొందరు.. పెట్టుబడి సాయం రైతు భరోసా రాక మరికొందరు ప్రాణాలు వదులుతున్నారని, కేసీఆర్ రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తోందని ఆరోపించారు. రైతు సురేందర్ రెడ్డి అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వాపీసుల చుట్టూ తిరిగినా రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్‌లో వ్యవసాయ కార్యాలయం సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.