మంత్రవర్గ విస్తరణలో ఛాన్స్ ఎవరికి?
NEWS Sep 12,2024 07:26 am
ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పెద్దలు ఖర్గే, సోనియాని కలువనున్నారు. ఖాళీగా ఉన్న 6 కేబినెట్ బెర్తులపై, నామినేటెడ్, MLC స్థానాల భర్తీపై చర్చించి ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలో నిర్ణయం తీసుకోనున్నారు. హోం, మున్సిపల్, విద్య, మైనింగ్ వంటి కీలక శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. కేబినెట్ విస్తరణలో పలువురు పదవులు ఆశిస్తున్నారు. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.