16న వేములవాడలో నిమజ్జనం
NEWS Sep 12,2024 08:23 am
సిరిసిల్ల: భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ఈ నెల 16న వేములవాడలో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని నిర్వహించనుండగా, రాజ రాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో చేస్తున్న ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యే ఆది, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,ఎస్పీ అఖిల్ మహాజన్,ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.