ఇసుక అక్రమ రవాణా.. 3 లారీలు, జేసీబీ సీజ్
NEWS Sep 12,2024 10:29 am
ఆలమూరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 లారీలు, ఒక జేసీబీని సీజ్ చేశామని ఎస్ఐ అశోక్ తెలిపారు. 33యూనిట్లు ఇసుకను స్వాధీనం చేసుకున్నామన్నారు. 3 లారీలను, JCBని పోలీస్ స్టేషనుకు తరలించినట్లు చెప్పారు. ఇసుక నిల్వ చేసిన జొన్నాడకు చెందిన వెంకటరెడ్డితో పాటు లారీ యజమానులు, JCB డ్రైవర్‌తో సహా 8 మందిపై కేసు నమోదు చేసామని తెలిపారు.